
శాలివాహనులు రాజకీయంగా ఎదగాలి
● రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు
ఖమ్మం మామిళ్లగూడెం: శాలివాహనులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాజకీయంగా మరింత ఎదగాలని మాజీ డీజీపీ జుజ్జవరపు పూర్ణచంద్రరావు సూచించారు. శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ, శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలో నిర్వహించిన రాజకీయ చైతన్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమ్మరి కులస్తులెవరూ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడం బాధాకరమని తెలిపారు. ఈమేరకు రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదగాలని సూచించారు. శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ ఉన్నత విద్యనభ్యసించే శాలివాహన విద్యార్థులకు సహకరిస్తామని తెలిపారు. ఈసమావేశంలో సూర్యారావు, శంకర్రావు, మల్లెల రామనాథం, శేషగిరిరావు, హన్మంతరావు, ఉపేందర్, సత్యనారాయణ, ప్రసాద్, చిరంజీవి, రాచర్ల రాజు, రమేష్, వెంకటేశ్వర్లు, భాస్కర్, సైదారావు, సర్వయ్య, పరశురాములు, కృష్ణ పాల్గొన్నారు.