30ఏళ్లకు కలిసిన పూర్వవిద్యార్థులు
రఘునాథపాలెం: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల 1993–96 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని వి.వెంకటపాలెంలో నిర్వహించారు. ఈసందర్భంగా ముప్పై ఏళ్లకు కలుసుకున్న స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడిగా గడిపారు. అంతేకాక అప్పటి లెక్చరర్లు రామచంద్రరావు, విద్యాసాగర్, వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ బ్యాచ్ విద్యార్థి, నటుడు ప్రభాకర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘానికి గది నిర్మాణం కోసం ముందుకొచ్చాడు.ఈకార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, కామేపల్లి సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రంతో పాటు ఎం.వెంకట్, శేఖర్, సిరాజ్, కవిరాజు, వీరస్వామి పాల్గొన్నారు.


