కేజీబీవీల్లోనూ అత్యుత్తమ మార్కులు
జిల్లాలోని 14 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ల్లో ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(జీసీడీఓ) తులసి తెలిపారు. అన్ని కేజీబీవీల్లో ప్రథమ సంవత్సరంలో 709మందికి 557మంది(79శాతం), ద్వితీయ సంవత్సరంలో 661మందికి 584మంది(89శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. కేజీబీవీల్లో బాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెరుగైన బోధన అందించడంతో ఈ ఫలితాలు వచ్చాయని తెలిపారు. బోనకల్ కేజీబీవీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించారని తెలిపారు. వచ్చే ఏడాది అన్ని కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోద య్యేలా కృషిచేస్తామని పేర్కొన్నారు.


