డబ్బులు ఊరికే రావు.. | - | Sakshi
Sakshi News home page

డబ్బులు ఊరికే రావు..

Feb 9 2025 12:23 AM | Updated on Feb 9 2025 12:23 AM

డబ్బు

డబ్బులు ఊరికే రావు..

● లలిత జ్యుయెలరీ మార్ట్‌ అధినేత కిరణ్‌కుమార్‌ ● ఖమ్మంలో షోరూంను ప్రారంభించిన మంత్రులు తుమ్మల, పొంగులేటి

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మంలో వైరారోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన లలిత జ్యుయెలరీ మార్ట్‌ను రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యుయెలరీ అధినేత డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ 41 ఏళ్లుగా దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా నిలుస్తున్న తమ సంస్థ 60వ షోరూంను ఖమ్మంలో ఏర్పాటు చేసిందని తెలిపారు. బంగారం, వజ్రం, వెండి ఆభరణాల ధరలను ఇతర షోరూంలతో పోల్చుకున్నాకే తమ వద్ద కొనుగోలు చేయాలన్నారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావనేది గుర్తుంచుకోవాలని, అధిక తరుగుతో నగలు కొని డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. తమ షోరూంలో తక్కువ తరుగుకే నగలు లభిస్తాయని చెప్పారు. కాగా, తగ్గింపు ధమాకా పేరిట అన్ని ఆభరణాలపై మార్కెట్‌ కంటే తక్కువ తరుగే కాక ఇంకో శాతం తగ్గింపు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.5 వేల తగ్గింపు, వెండి వస్తువులపై ప్రత్యేక తగ్గింపు ఉందని వెల్లడించారు. అలాగే, తమ షోరూంలో ప్రీ బుకింగ్‌ స్కీమ్‌ ఉందని, ఈ పథకంలో చేరిన వారికి 11 నెలల తర్వాత కూడా ఒక శాతం తరుగు లేకుండా నగలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని కిరణ్‌కుమార్‌ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహరా, కార్పొరేటర్‌ పాకాలపాటి విజయనిర్మల, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

డబ్బులు ఊరికే రావు.. 1
1/1

డబ్బులు ఊరికే రావు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement