నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

Published Sat, Apr 13 2024 12:10 AM

-

ఖమ్మంవన్‌టౌన్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేటలో జరిగే శ్రీశ్రీ లింగా బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటారని, 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగూడెం విద్యానగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

Advertisement
 
Advertisement