తెలంగాణ గోల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక
తల్లాడ: మండలంలోని నారాయణపురం, మిట్టపల్లికి చెందిన కాంపల్లి సూర్యప్రకాష్, నాసా ఆదిత్యసుభాష్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యాన నిర్వహించే తెలంగాణ గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నీకి జిల్లా జట్టు తరపున ఎపింకయ్యారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్ చదువుతుండగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 27న మొదలయ్యే టోర్నీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గ్రామస్తులు శుక్రవారం అభినందించారు.
30నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో ఈనెల 30వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ బాధ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం నిర్వాహకుడు సూరేపల్లి శ్రీను మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఏటా మాదిరిగానే కబడ్డీ పోటీలు ఏర్పాటుచేశామని చెప్పారు. అలాగే, ముగ్గులు, ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని కోరారు.
కాలి నడకన
శ్రీశైలానికి పయనం
రఘునాథపాలెం: ప్రజల క్షేమం, గ్రామాభివృద్ధి కోసం రఘునాథపాలెం మండలం వీవీపాలెం మాజీ సర్పంచ్ వెంపటి కృష్ణమోహన్‌రావు ఏపీలోని శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు. ఏటా శివమాల ధరించే ఆయన ఐదేళ్లుగా శ్రీశైలానికి కాలి నడకన వెళ్తున్నాడు. ఈ సారి కూడా 350 కి.మీ. మేర ప్రయాణా న్ని ఇరుముడి కట్టుకుని బయలుదేరాడు. పాదయాత్ర పది రోజుల పాటు సాగుతుందని కృష్ణమోహన్‌రావు తెలిపారు.
చర్చి అభివృద్ధికి
రూ.లక్ష విరాళం
నేలకొండపల్లి: మండలంలోని అమ్మగూడెంలో చర్చి నిర్మాణానికి సర్పంచ్ పొట్ట లక్ష్మి చంద్రశేఖర్ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. చర్చిలో శుక్రవారం జరిగిన ప్రార్థనలకు హాజరైన వారు అభివృద్ధి కోసం నిర్వాహకురాలు వందనకు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలి
బడ్డీకొట్టు దగ్ధం
కూసుమంచి: మండలంలోని ఈశ్వరమాధారంలో ఓ బడ్డీకొట్టులో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన గుండెబోయిన పద్మ, ఆమె కుమార్తె మల్లీశ్వరి చిన్న డబ్బాకొట్టులో హోటల్ ఏర్పాటుచేసుకున్నారు. రోజులాగే శుక్రవారం బజ్జీలు వేస్తుండగా సిలిండర్ నుంచి మంటలు వస్తుండడంతో పద్మ పరుగెత్తింది. ఇంతలో మంటలు పెరిగి సిలిండర్ పేలగా బడ్డీకొట్టు, సామగ్రి కాలిపోయాయి. అయితే, సమీపానే హైస్కూల్, అంగన్‌వాడీ కేంద్రం ఉన్నా సెలవు కావడంతో ప్రమాదం తప్పినట్లయింది. రూ.50వేల మేర నష్టం జరిగిందని తమను ఆదుకోవాలని పద్మ విన్నవించింది.
తెలంగాణ గోల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక
తెలంగాణ గోల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక


