పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో
రఘునాథపాలెం: అకారణంగా తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ రఘునాథపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు శుక్రవారం పోలీసుస్టేషన్ ఎదుట ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దాడి చేసిన వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానికుల కథనం... క్రిస్మస్ వేడుకల సందర్భంగా గురువారం రాత్రి ఎస్సీ కాలనీలో చిన్న విషయమై రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఓ వర్గానికి చెందిన వారు మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం మరోసారి దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమై బాధిత వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ చేయడం లేదంటూ పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఒక కానిస్టేబుల్ తమను దూషించాడని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ చేరుకుని సమగ్రంగా విచారిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనతో అరగంట పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, రెండు వర్గాలకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేయగా, రాస్తారోకో చేసిన వారిపైనా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్


