గోదావరి తీరాన ఏరు ఉత్సవాలు
నేడు 230 మంది యువతతో
భద్రాచలంలో ఫ్లాష్ మాబ్
వివరాలు వెల్లడించిన
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాచలంటౌన్: గోదావరి తీరంలో ‘ఏరు–ది రివర్ ఫెస్టివల్’ వేడుకల్లో భాగంగా శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలంలోని తెప్పోత్సవ ఘాట్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. స్థానిక యువత230 మందితో ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామూహిక నృత్యప్రదర్శన, నదీ హారతి కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఏరు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
అలరించిన ఏరు ఉత్సవం..
దుమ్ముగూడెం: మండల పరిధిలోని బొజ్జిగుప్ప గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఏరు ఉత్సవం ఆహూతులను అలరించింది. గిరిజన నృత్యాలు, క్యాంప్ ఫైర్ తదితర కార్యక్రమాలు సందడిగా సాగాయి. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్‌శర్మ, కేంద్ర హౌసింగ్ అధికారి కుశాల్ తదితరులు హాజరై ఉత్సవాలను వీక్షించారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి ప్రాచుర్యం చెందేలా ప్రయత్నిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీఓ వివేక్‌రామ్, ఆర్‌ఐలు కల్లూరి వెంకటేశ్వరరావు, నరసింహారావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.


