రైల్వేలైన్.. పరిహారం లేట్
కొలిక్కిరాని పరిహారం
మార్కెట్ ధరపై పది రెట్లు పెంచి
ఇవ్వాలని వినతులు
ఎటూ తేల్చకపోవడంతో
నిర్వాసితుల ఎదురుచూపులు
కారేపల్లి: డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) వరకు కారేపల్లి జంక్షన్ మీదుగా రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈక్రమాన భూమి సేకరించాల్సి ఉండగా వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం లెక్క కట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరు నెలలుగా సర్వేలు, గ్రామసభలు కొనసాగుతున్నా పరిహారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో వ్యవసాయ భూములు కోల్పోనున్న రైతులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోనున్న ప్రజలు ఎదురుచూస్తూ కాలం గడపాల్సి వస్తోంది. అయితే, మార్కెట్ ధరపై పది రెట్లు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటారా లేక నామమాత్రంగా చెల్లిస్తే తాము బతకడం ఎలా అన్న ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి.
మండలంలో 54 ఎకరాలు
కారేపల్లి మండలంలోని కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో 54 ఎకరాలు అవసరమని గుర్తించిన రైల్వే అధికారులు సర్వే కూడా చేశారు. ఇందులో సింగరేణి రెవెన్యూలో 60 – 70 మంది రైతుల నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాల్సి ఉంది. అలాగే, కారేపల్లి స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్‌ఫాం, అదనపు ట్రాక్‌ల నిర్మాణానికి 20 కుటుంబాలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, రైల్వేస్టేషన్ పరిధిలో 65మీటర్ల మేర భూమితో పాటు పలువురి ఇళ్లు సేకరించాల్సి ఉండగా.. అధికారులు మార్కింగ్ సైతం వేశారు.
నా భర్త చనిపోయాడు. పెద్ద కుమార్తె, ఆమె పిల్లలతో కలిసి ఖాళీ స్థలంలో రేకులు షెడ్డు వేసుకుని ఉంటున్నా. రైల్వే లైన్‌లో మా ఇల్లు పోతుందని చెబుతున్నారు. చాలీచాలని పరిహారం కాకుండా వేరే చోట్ల ఇల్లు కట్టించి ఇస్తే బాగుంటుంది.
– షేక్ జాన్‌బీ, కారేపల్లి
ఇంటి స్థలం గజానికి రూ.2వేలు, దీనికి రెండు రెట్లు పెంచి రూ.6వేల చొప్పున ఇస్తామని చెబుతున్నారు. కారేపల్లిలో ఇంటి స్థలం ధర గజం రూ.10వేలకు పైగానే ఉంది. అధికారులు నామమాత్రంగా ఇచ్చే పరిహారంతో సర్వం కోల్పోతాం.
– కొప్పుల బాలకృష్ణ, కారేపల్లి
ఇటీవల జరిగిన గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి పాల్గొని భూసేకరణ, పరిహారం నిబంధనలను వివరించారు. అయితే, సింగరేణి(కారేపల్లి) రెవెన్యూ గ్రామం మైదాన ప్రాంతంలో ఉన్నందున వ్యవసాయ భూమి ఎకరాకు రూ.91లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి గజం రూ.20వేలు చొప్పున చెల్లించాలని నిర్వాసితులు కోరారు. అంతేకాక వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలకు మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈక్రమంలో కారేపల్లికి చెందిన భవనాసి గణేష్ ఎకరం భూమి విలువ రూ.91.48 లక్షలుగా, మరో సర్వేనంబర్‌లో రూ.1.12కోట్లుగా, ఇదే గ్రామానికి చెందిన ముండ్ల సుధాకర్ భూమి రూ.1.12కోట్లుగా మార్కెట్ విలువ ఉందని ఎస్‌డీసీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ముగ్గురి రైతుల పేర్లు భూసేకరణ జాబితాలో ఉన్న ందున మార్కెట్ ధరను పరిగణనలోకి పరిహారం చెల్లించాలని కోరారు. అయితే, సర్వే పూర్తయి, గ్రామసభలు జరిగి నెలలుగా గడుస్తున్నా పరి హారంపై స్పష్టత రాకపోవడంతో భూములు, ఇళ్లు కోల్పోనున్న వారిలో అయోమయం నెలకొంది.
నెలలు గడుస్తున్నా
కొలిక్కిరాని ధర
రైల్వేలైన్.. పరిహారం లేట్
రైల్వేలైన్.. పరిహారం లేట్
రైల్వేలైన్.. పరిహారం లేట్


