కొత్తగూడెంటౌన్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి పాఠశాల క్రీడాకారుల జట్లను ఈ నెల 16, 17వ తేదీల్లో ఎంపిక చేయనున్నట్లు డీఈఓలు సోమశేఖరశర్మ, వెంకటేశ్వరాచారి తెలిపారు. ఈ నెల 16న కొత్తగూడెం రామవరంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్‌లో సెపక్‌తక్రా, 17వ తేదీన అండర్–14, 17 విభాగాల్లో సైక్లింగ్ ఎంపిక పోటీలు పాల్వంచలోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల నుంచి క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా పీఈటీలు చొరవ చూపాలని డీఈఓలు సూచించారు.
వంద శాతం
ఉత్తీర్ణత సాధించాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బుధవారం ఆయన జూమ్ మీటింగ్ ద్వారా సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థుల్లో సీ, డీ గ్రేడ్ ఉన్నవారిని ఏ, బీ గ్రేడ్‌కు తీసుకొచ్చేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈసమావేశంలో డీడీ మణమ్మ, అధికారులు పాల్గొన్నారు.