దెయ్యాలు బాబోయ్‌ | Man Creates Fake Ghost Video In Karnataka Mandya To Gain Views, Police Urge Public Not To Panic | Sakshi
Sakshi News home page

ఓ యూట్యూబర్‌ నకిలీ వీడియోలు

Oct 7 2025 9:15 AM | Updated on Oct 7 2025 10:24 AM

YouTuber Ghosts Fake Videos In Karnataka

దెయ్యాల గురించి వైరల్‌ అయిన పోస్టులు, యూట్యూబర్‌ గోపి

మండ్య : సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలని చిత్ర విచిత్రమైన వీడియోలను తయారు చేస్తూ ఉంటారు కొందరు. అదే కోవలో దెయ్యాలు తిరుగుతున్నాయని, కనిపించినవారిపై దాడులు చేస్తున్నాయని వీడియోలు తీసిన ఓ ఘనుని ఉదంతమిది. మండ్య జిల్లాలోని నాగమంగలలో వెలుగుచూసింది. 

వివరాలు.. పట్టణవాసి గోపి యూట్యూబ్‌ వీడియోలు చేస్తుంటాడు.  దేవలాపుర హ్యాండ్‌పోస్ట్‌ వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ప్రజలను చాలా  ఇబ్బందులు పెడుతున్నాయని ఓ వీడియోను సృష్టించి పోస్ట్‌ చేశాడు. అందులో ఓ మహిళ దయ్యం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన ప్రజలు నిమేననుకుని హడలిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసి గోపిని పిలిపించారు. ఎలాంటి దయ్యాలు లేవని, వ్యూస్‌ కోసం నకిలీ వీడియోను రూపొందించానని గోపి చెప్పాడు. ఆ వీడియోను తొలగించాడు. ఎలాంటి దయ్యాలు లేవు, ప్రజలు భయపడకండి అని పోలీసులు ఫ్యాక్ట్‌ చెక్‌ అని ఓ పోస్టింగ్‌ను ఉంచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement