వర్క్‌ ఫ్రమ్‌ హోంతో ఇంటికి రాగా ముగ్గురు కరోనాకు బలి | Mother Father And Daughter Died With Corona | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి వచ్చిన కుమారుడితో సోకిన కరోనా

May 27 2021 9:46 AM | Updated on May 27 2021 9:51 AM

Mother Father And Daughter Died With Corona - Sakshi

కరోనాతో మృతిచెందిన రుద్రప్ప, సునీతమ్మ, నందిని

సాక్షి బళ్లారి: కరోనా రక్కసి మృత్యుతాండవం చేసింది. ఒక కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన బళ్లారి జిల్లాలో కురుగోడు తాలూకా పరిధిలోని మదిరే గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రుద్రప్ప కుమారుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ ప్రకటనతో పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వడంతో నెల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అప్పుడే కుమారుడికి కరోనా సోకింది.

ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ కోలుకున్నాడు. అయితే కుమారుడి ద్వారా తల్లి సునీతమ్మ (45), చెల్లి నందిని (18)కి, తండ్రి రుద్రప్ప (56)కు కరోనా సోకింది. సునీతమ్మ, నందిని కంప్లిలో చికిత్స పొందుతూ 15 రోజుల కిందట మృతి చెందారు. తాజాగా బళ్లారిలో చికిత్స పొందుతున్న రుద్రప్ప మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో   గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement