● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర
కోలారు: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించగా, ప్రతిగా బీజేపీ కోలారు జిల్లాలో విజయ సంకల్ప యాత్రకు గురువారం నాంది పలికింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి వై విజయేంద్ర ముళబాగిలు తాలూకా కురుడుమలై గ్రామంలోని పురాణ ప్రసిద్ద వినాయక దేవాలయంలో పూజలు చేసి మొక్కను నాటి యాత్రను ప్రారంభించారు. వినాయక దేవాలయం నుంచి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర జిల్లాలోని వివిధ తాలూకాలలో సాగింది.
విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషనర్‌పై అభాంఢాలు వేసే దుస్సాహసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే రైతులకు రూ.2,500 భిక్షం ఇస్తారా? అని సర్కారును విమర్శించారు. సీఎం డీకే శివకుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏమీ చేయడం లేదన్నారు. గృహలక్ష్మి పథకంలో రూ.5 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయనే దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ యాత్రలో నాయకులు ప్రీతంగౌడ, నందీష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


