నుంచి మైసూరు దసరా | - | Sakshi
Sakshi News home page

నుంచి మైసూరు దసరా

Oct 2 2026 1:22 AM | Updated on Oct 2 2026 1:22 AM

మైసూరు: సాంస్కృతిక పరంపరకు పేరుగాంచిన మైసూరు దసరా మహోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్‌ 11వ తేదీన చాముండి గిరులపై అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ఉత్సవాలకు నాంది పలుకుతారు. ఆ క్షణం నుంచి 10 రోజుల పాటు మైసూరులో వివిధ ప్రదేశాలలో సాంస్కృతిక కళా వేడుకలు ఆరంభమవుతాయి.

ఉత్సవ అతిథి గవిసిద్ధేశ్వర స్వామి

11వ తేదీ, ఆదివారం ఉదయం 11:50 నుంచి 12:13 గంటల మధ్య పవిత్ర ధనుర్‌ లగ్నంలో చాముండి కొండపై కొప్పల్‌గావి మఠాధిపతి అభినవ గవిసిద్ధేశ్వర మహాస్వామి చాముండేశ్వరి దేవికి అగ్ర పూజ చేసి దసరా మహోత్సవాలను ప్రారంభిస్తారు. సీఎం, ప్రముఖులు పాల్గొంటారు.

నిత్యం వైవిధ్య సంబరాలు

11వ తేదీన, ఉదయం 11:30 గంటలకు మైసూరులో ఫల పుష్ప ప్రదర్శన, సాయంత్రం 4 గంటలకు కుస్తీ పోటీలు, సాయంత్రం లలిత కళలు, హస్తకళా శిబిరం, దసరా సీఎం కప్‌ క్రీడా పోటీలు, సాయంత్రం 5 గంటలకు దసరా సాంస్కతిక నృత్య గాన కచేరీలు.. ఇలా నిత్యం వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే ఉత్సవాలు రంజుగా నిర్వహిస్తారు. పిల్లలు, మహిళల కోసం రంగోళి, క్రీడా పోటీలు ప్రత్యేకంగా ఉంటాయి. కవి దసరా, యువ దసరా, రైతు దసరా, పల్లె దసరా, పోలీసు బ్యాండ్‌ ప్రదర్శనలు జరుగుతాయి. యోగా ఉత్సవాలు, పెంపుడు జంతువుల ప్రదర్శన, 18న ఉదయం 10 గంటలకు సతగల్లి లో కంబళ పోటీలు నిర్వహిస్తారు.

21న మీన లగ్నంలో జంబూసవారీ

అక్టోబర్‌ 21న విజయదశమి కాగా, ఆరోజు మధ్యాహ్నం 1:36 గంటల నుంచి 1:56 గంటల మధ్య సీఎం డీకే శివకుమార్‌ అంబావిలాస ప్యాలెస్‌లో నంది ధ్వజానికి పూజలు చేస్తారు. మీన లగ్నంలో సాయంత్రం 4:10 నుంచి 4:35 గంటల మధ్య బంగారు అంబారీలో అమ్మవారి విగ్రహంతో జంబూసవారీ గజ యాత్ర ప్రారంభమవుతుంది.

గవి సిద్ధేశ్వర స్వామిచే ఆరంభం

మహోత్సవాలకు కౌంట్‌డౌన్‌

ఉత్సవాలకు రారండీ

మైసూరు: మైసూరు దసరా మహోత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం బెంగళూరులో గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు అధికారిక ఆహ్వానాన్ని అందించారు. మైసూరు ఇన్‌చార్జి మంత్రి యతీంద్ర సిద్దరామయ్య నేతృత్వంలో సమితి సభ్యులు లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను ఆహ్వానించారు. తరువాత సీఎం డీకే, ఆపై డీసీఎం పరమేశ్వర్‌ నివాసాలకువెళ్లి ఆహ్వానం పలికి ఉత్సవ విశేషాలను వివరించారు. జిల్లా కలెక్టరు లక్ష్మీకాంత్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సీమా లాట్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు మైసూరులో ప్రధాన ఏనుగు సుగ్రీవకు చెక్క అంబారీతో సాధనను ముమ్మరం చేశారు. యువ సంభ్రమ వేడుకల్లో జనం ఉత్సాహం మిన్నంటుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement