జీవితఖైదీల పెళ్లికి హైకోర్టు పచ్చజెండా | - | Sakshi
Sakshi News home page

జీవితఖైదీల పెళ్లికి హైకోర్టు పచ్చజెండా

Oct 2 2026 1:22 AM | Updated on Oct 2 2026 1:22 AM

బనశంకరి: హత్య కేసులో బెళగావి మూడలగి జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రేమ జంట పెళ్లి చేసుకోవడానికి హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆ జంట శ్రీధర్‌ (22), సిద్దవ్వ అలియాస్‌ ప్రియాంక (21). బెళగావి జిల్లాలో ఓ గ్రామంలో ఈమెకు, శ్రీధర్‌కు అక్రమ సంబంధం ఉండేది. భర్త అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ కలిసి 2023లో అతన్ని నరికి చంపారు. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నారు.

వివాహానికి తహతహ

ఇప్పటికి 3 ఏళ్ల 5 నెలల శిక్షాకాలం పూర్తయింది. మరోవైపు తమ అక్రమ సంబంధాన్ని పెళ్లిగా మలచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సెలవు కోసం జైలు అధికారులకు అర్జీ ఇవ్వగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. నైతికత పేరుతో చట్టబద్ధమైన పెళ్లి చేసుకునే హక్కును నిరాకరించలేమని గురువారం ధార్వాడలోని హైకోర్టు బెంచ్‌ స్పష్టంచేస్తూ పెళ్లికి ఒక్కరోజు పెరోల్‌ ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేసుకోవాలని, నిబంధనల ప్రకారం భద్రత కల్పించాలని జడ్జి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement