సర్‌లో నిండా అక్రమాలే.. ఓట్ల తొలగింపులే | - | Sakshi
Sakshi News home page

సర్‌లో నిండా అక్రమాలే.. ఓట్ల తొలగింపులే

Oct 2 2026 1:22 AM | Updated on Oct 2 2026 1:22 AM

శివాజీనగర: ప్రత్యేక ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో జరిగిన అవకతవకలపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం నివాస కార్యాలయం కృష్ణాలో సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫారం 7ను వేరే చోట ముద్రించి ఇక్కడి బీఎల్‌ఓలకు సమర్పించడం ద్వారా అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తీసేశారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్నారు. వందలాది మంది బీజేపీ, జేడీఎస్‌ కార్యకర్తలు ఫారం 7లు ఇచ్చారు, ఇవి వారికి ఎలా లభించాయి, గణాంకాలను ఎవరు ఇచ్చారు. అన్నింటిపైనా విచారణ జరగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అర్హులైన ఓటర్లను కాపాడటం నా విధి, సర్‌లో అవకతవకలపై పోలీసులతో విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మైనార్టీలు, దళితులు, ఓబీసీలతో సహా వివిధ వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఒక్క బాల్కి నియోజకవర్గంలోనే వేలాది ఫారం–7 దరఖాస్తులు దాఖలైనట్లు చెప్పారు. ఓటర్ల వ్యక్తిగత వివరాలతో ముద్రించిన ఈ దరఖాస్తులు ఎలా వచ్చాయన్నారు.

ఈసీ ఆఫీసులో సీఎం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముందు సీఎం డీకే శివకుమార్‌, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో సర్‌ ద్వారా 1.07 కోట్ల మంది ఓటర్లను విస్మరించారని, 45 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారని, సుమారు 50 లక్షల మంది ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలు కుట్ర చేశారని ఆరోపించారు. శేషాద్రి రోడ్డులోని ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి బైఠాయించారు. దుర్వినియోగంపై విచారణకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ప్రధాన ఎన్నికల అధికారి అన్బుకుమార్‌ కోరారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించిన తర్వాత వాటిని పరిశీలిస్తానని సీఈఓ హామీ ఇచ్చారు.

దీనిపై కేసు పెట్టి, దర్యాప్తు చేయాలి

సీఎం డీకే శివకుమార్‌ డిమాండ్‌

ఈసీ ఆఫీసు ముందు బైఠాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement