తారాలోకం నుంచి
పాతాళానికి
రన్య రావ్ నటిగా, ఐపీఎస్ రామచంద్రరావు కుమార్తెగా బెంగళూరు సర్కిల్స్‌లో తళుకులీనేది. అయితే 2025 మార్చి 3వ తేదీన ఆమె తారాలోకం తారుమారైంది. ఆమె కెంపేగౌడ విమానాశ్రయంలో దుబాయ్ విమానం నుంచి దిగి వస్తుండగా డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులు అడ్డుకుని తనిఖీలు చేయడంతో గోల్డ్ స్కాం బట్టబయలైంది. రన్య రావ్ దుస్తుల్లో దాచుకున్న 14 కేజీల పసిడి బిస్కెట్లు పట్టుబడ్డాయి. తరువాత ఇళ్లలో చేసిన సోదాలో 20 కేజీలకుపైగా బంగారం దొరికింది. ఆమెతో కలిసి దొంగచాటుగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారని తరుణ్ రాజు కొండూరు, సాహిల్ జైన్, భరత్‌జైన్‌లను డీఆర్‌ఐ, ఈడీ అరెస్టు చేసి విచారించాయి.
ఎవరికెంత జరిమానా?
ఈ నేపథ్యంలో గురువారం కస్టమ్స్ శాఖ జరిమానా ఉత్తర్వులను జారీ చేసింది. రన్య రావ్‌కు రూ.89.91 కోట్లు, ఇతర నిందితులు తరుణ్‌రాజు కొండూరుకు రూ.49.51 కోట్లు, సాహిల్ జైన్‌కు రూ.53.06 కోట్లు, భరత్‌కుమార్ జైన్‌కు రూ.53.06 కోట్లు జరిమానా విధించారు. దీనిని చెల్లిస్తారా, లేక న్యాయస్థానాల్లో సవాల్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
బనశంకరి: కన్నడనాటే కాదు దేశంలో సంచలనం కలిగించిన బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడిన వ్యవహారంలో నిందితురాలు రన్య రావ్, ఆమెతో లింకులు ఉన్న ముగ్గురికి కేంద్ర కస్టమ్స్ శాఖ భారీ మొత్తంలో జరిమానా విధించింది. నలుగురికీ కలిపి రూ.244 కోట్ల జరిమానా వేయడం మరోసారి చర్చనీయాంశమైంది.
దుబాయ్ టూర్లపై నిఘా
నటి రన్యారావ్ సినిమా రంగం నుంచి విశ్రాంతి తీసుకుని, వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులో డాలర్స్‌కాలనీలో నివాసం ఉంటున్న రన్యారావ్ తరచూ దుబాయ్ టూర్‌కు వెళ్తుండడంతో కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు ఆమైపె నిఘా వేశారు. ఆమె చాలా ఏళ్లుగా విదేశాల నుంచి దేశానికి బంగారం తీసుకువస్తోందని డీఆర్‌ఐ ఆరోపించింది. ఆమె రూ.102 కోట్ల విలువైన 113 కేజీల బంగారాన్ని భారత్‌కు అక్రమంగా తీసుకొచ్చిందని డీఆర్‌ఐ ప్రకటించింది. రన్యారావ్ స్మగ్లింగ్‌ను తీవ్రంగా పరిగణించిన డీఆర్‌ఐ కాపీపోసా చట్టం ప్రయోగించి ఏడాదిపాటు బెయిలు రాకుండా చూసింది. చివరకు 2026 ఏప్రిల్ 22వ తేదీన బెయిలు దక్కింది.
రన్యా రావ్‌ను వీడని కష్టాలు
రూ.89 కోట్ల భారీ జరిమానా
స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ శాఖ చర్యలు
మరో ముగ్గురు నిందితులకు కూడా


