పర్యాటకానికి ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి ప్రోత్సాహం

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

● టూరిజం ఉత్సవాలలో మంత్రి జార్జ్‌

మైసూరు: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన, పర్యాటక శాఖ మంత్రి కె.జె. జార్జ్‌ అన్నారు. ఆదివారం మైసూరులోని అంబావిలాస్‌ ప్యాలెస్‌ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కోస్తా, మలెనాడు, హంపీ, బాదామి, బీజాపూర్‌, కొడగు, చిక్కమగళూరు సహా యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక దైవజనుల భూమి అని ఆయన అన్నారు. దసరాకు వచ్చే విదేశీ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, గౌరవప్రదమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి నాడహబ్బను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటే రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఆయన అన్నారు. మైసూరులో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దసరా సమయంలోనే కాకుండా, సంవత్సరమంతటా రోజూ అర్ధగంట పాటు రాజభవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని సిటీ ఎమ్మెల్యే తన్వీర్‌ సేట్‌ కోరారు. మైసూరు, కొడగు, చామరాజనగర, హాసన్‌, మండ్య జిల్లాలను కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌ చిక్కమాదు, కలెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement