రాయచూరు రూరల్: సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయి. రాయచూరు, యాదగిరి, దేవదుర్గ ప్రాంతాల్లో వరుణ దేవుడు కరుణించాలని ప్రార్థిస్తూ ఆదివారం ప్రత్యే పూజలు చేపట్టారు. ఆదివారం ఆయా ప్రాంతాల్లో గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ‘గుర్జి జోకుమార’ అంటూ జానపద శైలిలో పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగారు. గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి, కరువు తీరాలని వేడుకున్నారు. మరోవైపు జోకుమారుడికి (మట్టితో చేసిన విగ్రహం) ప్రత్యేక పూజలు చేపట్టి, విగ్రహాన్ని పల్లెల్లో ఊరేగించారు. వానలు కురవాలంటూ పెద్ద పెట్టున కేకలు వేస్తూ, జానపద గీతాల ద్వారా ఆ దేవుడికి కష్టాలను మొరపెట్టుకున్నారు.


