కంకర రోడ్డుపై అవస్థలు | - | Sakshi
Sakshi News home page

కంకర రోడ్డుపై అవస్థలు

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

హొసపేటె: విజయ నగర జిల్లా కూడ్లిగి తాలూకా కానహోసహళ్లి సమీపంలోని రంగనాథహళ్లి వద్ద రోడ్డు పనులు ఆగిపోయాయి. మూడు నెలల క్రితం రోడ్డు పనులు ప్రారంభం కాగా.. నేటికీ తారు వేయడం పూర్తి కాలేదు. కానహోసహళ్లి–ఉజ్జిన అనుసంధాన రహదారి రెండవ దశ పనులు నింబళగెరె అటవీ ప్రాంతం వరకు విస్తరించి, కంకర వేసే పనులు పూర్తయ్యాయి. చాలా రోజులు గడిచినా తదుపరి పనులు ప్రారంభం కాలేదు. రాళ్లమయమైన రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దుమ్ము, వర్షాల సమయంలో బురద కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రోడ్డుపై పడి గాయపడిన ఘటనలు ఉన్నాయి. తారు వేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement