హిందీని గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

హిందీని గౌరవించాలి

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

రాయచూరు రూరల్‌: దేశ వ్యాప్తంగా హిందీ భాషకు ప్రాముఖ్యత ఉంది. హిందీని అందరూ గౌరవించాలని నవోదయ పాఠశాల హిందీ అధ్యాపకుడు కె.పి.సింగ్‌ సూచించారు. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తారానాథ్‌ విద్య సంస్థలో కార్యక్రమంలో నిర్వహించారు. భారతదేశ సంస్కృతిని, వైవిద్యాన్ని ఏకం చేయడంలో హిందీ భాష కీలకపాత్ర పోషిస్తుందన్నారు. హిందీ భాషపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో అరుణ హిరేమఠ్‌్‌, వీర హనుమాన్‌, శరణస్త్ర గౌడ, ఆంజనేయ, చక్రధర్‌, దీక్షిత, హర్షిత తదితరులు పాల్గొన్నారు.

అనిల్‌ కుమార్‌కు డాక్టరేట్‌

బళ్లారి అర్బన్‌: బళ్లారి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐటీఎం) కళాశాల సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌కు బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (వీటీయూ) పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. శనివారం బెల్గాంలోని వీటీయూ క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవంలో కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లోట్‌, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తదితరుల సమక్షంలో పట్టా స్వీకరించారు. వివిధ మోలారిటీలకు మల్టీ ఫైబర్స్‌, ఎం–శాండ్‌తో కూడిన జియోపాలిమర్‌ కాంక్రీట్‌ పని తీరు మూల్యాంకనం అనే అంశంపై ఎస్‌.శోభ మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేశారు.

అన్నభాగ్య బియ్యం

అక్రమ రవాణా

హుబ్లీ: తగిన దాఖలాలు లేకుండా రేషన్‌ బియ్యం (అన్నభాగ్య బియ్యం) రవాణా చేస్తున్న లారీని తాలూకాలోని సంశి వద్ద ప్రజలే పట్టుకుని కుందగోళ పోలీసులకు అప్పచెప్పారు. అయితే దీనిపై తహసీల్దార్‌ రాజు, ఆహార సరఫరా శాఖ ఉద్యోగి సకుబాయిను విచారించగా స్పష్టమైన సమాచారం తెలియరాలేదన్నారు. పోలీస్‌ అధికారులను సంప్రదించగా.. లారీ పోలీస్‌ స్టేషన్‌లో ఉందని.. బియ్యం రవాణాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. వాహనంపై అన్నభాగ్య బోర్డు ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

పాదచారి ప్రాణాలు తీసిన చోదకుడికి ఏడాది జైలు

హుబ్లీ: ప్రమాదంలో పాదచారి చావుకు కారకుడైన బైక్‌ చోదకుడికి ఏడాది కారాగృహ శిక్ష, అలాగే బైక్‌ ఇచ్చిన వ్యక్తి రూ.14 వేల జరిమానా విధిస్తు ధార్వాడ ప్రధాన సీజేఎం కోర్టు తీర్పు వెలువరించింది. వికాస నగర మహబూబ్‌ అలీ జైల్‌ శిక్షకు గురైన వ్యక్తి. ఇతడికి బైక్‌ ఇచ్చిన మనకిల్లా నివాసి జాఫర్‌ సాధిక్‌కు రూ.5 వేల జరిమాన విధించారు. వివరాలు.. 2025 మే 29న రాత్రి 10 గంటలకు మహబూబ్‌ అలీ బైక్‌లో వెళ్తూ శ్రీధర నారాయణప్ప అనే వ్యక్తిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రీధర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ధార్వాడ ట్రాఫిక్‌ సీఐ కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ సమర్పించారు. ఈ కేసులో వాదోపవాదాలు విన్న కోర్టు న్యాయమూర్తి వెంకన హొసమని శిక్ష విధింఆచరు. లైసెన్స్‌ లేకున్నప్పటికీ బైక్‌ ఇచ్చిన నేరానికి జాఫర్‌ సాధిక్‌కు రూ.5 వేల జరిమానా విధించినట్లు ప్రభుత్వ సీనియర్‌ సహాయ ప్రభుత్వ న్యాయవాది ముకుంద దేశ్‌పాండే తెలిపారు.

విద్యుత్‌ సరఫరా

చేయాలని నిరసన

రాయచూరు రూరల్‌: నగర పరిధిలోకి వచ్చే గ్రామీణ ప్రాంతాలకు సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాయచూరు నగరంలోని జెస్కాం కార్యాలయం వద్ద శనివారం రాత్రి భారీ ఆందోళన చేపట్టి, అక్కడే నిద్రించారు. గ్రామాల్లో వ్యవసాయానికి, గృహ అవసరాలకు కనీసం 12 గంటల పాటు నిరంతర విద్యుత్‌ పంపిణీ చేయాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. తమ సమస్యలపై స్థానిక నగర శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదృశ్యమైన

ఇంజినీరు కోసం గాలింపు

యశవంతపుర: కాంట్రాక్టర్ల ఒత్తిడిని తట్టుకోలేక గదగ్‌లో కేఆర్‌డిఐఎల్‌ ఎఈఈ పర్వీజ్‌ ధారవాడ (34) అదృశ్యం కాగా, పోలీసులు 4 బృందాలతో గాలిస్తున్నారు. ఈ నెల 13న గదగ్‌ నుంచి రైల్లో బెంగళూరుకు వెళ్లిన ఆనవాళ్లు కనుగొన్నారు. స్థానిక పోలీసులు వ్యక్తి సమాచారంతో పాటు బ్యాంక్‌ వివరాలపై విచారణ చేస్తున్నారు. హావేరిలో ఆయన భార్య పుట్టినింటితో పాటు పలు ప్రదేశాలలో గాలించారు. ఓ బృందం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లింది. ఒక్కో బృందం ఒక్కో తరహాలో అన్వేషిస్తోందని డీఎస్పీ ముత్తుజా ఖాద్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement