భళా వ్యవసాయ మేళా
ధార్వాడలోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కృషి మేళా – 2026 రైతులతో పాటు అపార జనసందోహాన్ని ఆకర్షిస్తోంది. అందులో వెలసిన వందలాది స్టాల్స్‌లో మేలిరకం వ్యవసాయ ఉత్పత్తులు, సేద్య ఉపకరణాలు, ఇంకా అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. మేళాకు ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చిన దృశ్యాలు – హుబ్లీ
స్టాళ్లను వీక్షించేందుకు తరలివెళ్తున్న ప్రజలు
ధార్వాడ వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాయంలో ఏర్పాటు చేసిన కృషిమేళా–2026
చరిత్రకు సాక్ష్యం సంగనకల్లు
సాక్షి, బళ్లారి: వేల ఏళ్ల క్రితం మనిషి జీవనం ఎలా ఉండేది? వేట నుంచి వ్యవసాయం వైపు మానవుడు ఎలా అడుగులు వేశాడు? రాతి పనిముట్లను ఎలా తయారు చేసుకున్నాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందించే పురావస్తు పాంతం సంగనకల్లు అని పలువురు వక్తలు తెలియజేశారు. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని బళ్లారి తాలూకా సమీపంలోని సంగనకల్లు ప్రాంతాన్ని సరళా దేవి కళాశాల విద్యార్థులు సందర్శించారు. మానవువుని జీవన విధానాన్ని తెలియజేసే ఆనవాళ్లను వీక్షించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సంగనకల్లు ప్రాంతంలో శిలాయుగం, నూతన శిలాయుగానికి చెందిన అనేక పురావస్తు ఆధారాలు వెలుగు చూశాయన్నారు. రాతి పనిముట్లు, మట్టి పాత్రలు అవశేషాలు, నివాస ప్రాంతాలు బయట పడినట్లు తెలిపారు. చరిత్రకు నిలయంగా సంగనకల్లు నిలుస్తోందన్నారు. ప్రజలు క్రమంగా జీనవ విధానాన్ని మార్చుకోగా.. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. సంగనకల్లు చరిత్రను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన పురావస్తు మ్యూజియంను విద్యార్థులు సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో శశికాంత్, నాగరాజు, అహిరాజు తదితరులు పాల్గొన్నారు.
10 మందికి గాయాలు


