విఘ్నేశ్వరా వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్వరా వీడ్కోలు

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

● హొసపేటెలో ఘనంగా

హిందూ మహాగణపతి నిమజ్జనం

● ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శన

● డీజే, డప్పుచప్పుళ్ల మధ్య యువత సందడి

హొసపేటె: హొసపేటె నగరంలో 13 రోజుల పాటు భక్తుల నుంచి పూజలందుకున్న విఘ్నేశ్వరుడు.. గంగ ఒడికి తరిలాడు. హిందూ మహాగణపతి మహోత్సవ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతి నిమజ్జనం వేలాది మంది భక్తుల మధ్య శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. మెయిన్‌ బజార్‌, మెయిన్‌ మసీదు రోడ్‌, గాంధీ చౌక్‌, మురంగడి సర్కిల్‌, సెంట్రల్‌ బస్టాండ్‌ రోడ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డును కాషాయ జెండాలు, బ్యానర్లు, తోరణాలతో అలకరించారు. డోల్లు, కోలాటం, తాష రాండోల్‌ వంటి వివిధ సాంస్కృతిక, జానపద కళా బృందాల ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంది. 18 అడుగుల ఎత్తైన హిందూ మహా గణపతి నిమజ్జన ఊరేగింపులో యువత డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు. అంతకుముందు మాజీ మంత్రి ఆనంద్‌సింగ్‌ ప్రార్థనలు చేసి విశ్వహిందూ మహాగణపతి ఊరేగింపును ప్రారంభించారు. స్టేషన్‌ రోడ్డులో ఉన్న పవర్‌ కాలువ వద్ద వేలాది మంది భక్తుల హర్షద్వానాల మధ్య గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ ఎస్‌.జాహ్నవి బందోబస్తు ఏర్పాటు చేశారు.

వినాయక ఊరేగింపు

క్రేన్‌ సహాయంతో నిమజ్జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement