హొసపేటె: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని డాక్టర్.పునీత్‌రాజ్ కుమార్ సర్కిల్ వద్ద సీపీఐఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకుడు జంబయ్య నాయక్ మాట్లాడుతూ.. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు కనీసం 14 నిర్ణయాలను వ్యతిరేకించారని తెలిపారు. ఓటర్ల డేటాబేస్‌ను కేంద్రీకరించడం, రాష్ట్ర స్థాయి అధికారులపై ఆంక్షలు విధించడం వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. గోవాలో 97 మంది ఓటర్లు అర్హులుగా గుర్తించినప్పటికీ, సాఫ్ట్‌వేర్ పరిమితుల కారణంగా వారి పేర్లు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపి వేయాలని కోరారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను పునరుద్ధరించాలన్నారు.కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.భాస్కర్‌రెడ్డి, తాలూకా అధ్యక్షుడు ఎన్.యల్లలింగ, నాయకులు ఎం.గోపాల, మహేష్, కేఎం.సంతోష్ కుమార్, కళ్యాణయ్య, ఉమామహేశ్వర పాల్గొన్నారు.


