డివైడర్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న కారు

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

● సత్యాత్మతీర్థ స్వామి సహా ముగ్గురికి గాయాలు

హుబ్లీ: బెంగళూరు బసవనగుడ ఉత్తరాధి మఠ సత్యాత్మతీర్థ స్వామి ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామీజీతో పాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్వాడ నుంచి సవనూరుకు వెళ్తుండగా బెంగళూరు జాతీయ రహదారిపై వాటర్‌ పార్కు సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో సత్యాత్మ తీర్థతో పాటు ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో తక్షణమే హుబ్లీ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ధార్వాడ ఉత్తరాధి మఠ సీఈఓ విద్యాదీశచార్య గుప్తా మాట్లాడుతూ.. స్వామిజీకి స్వల్ప గాయాలయ్యాయి. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement