చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

రాయచూరు రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో అపౌష్టికతతో (పోషకాహార లోపంతో) బాధపడుతున్న బలహీనమైన పిల్లలను గుర్తించి, వారికి తక్షణమే నాణ్యమైన పౌష్టికాహార పదార్థాలను పంపిణీ చేయాలని సీడీపీఓ వనజాక్షి పేర్కొన్నారు. యాదగిరి జిల్లా గురుమిట్కల్‌ తాలూకా కొంకల్‌ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురుమిట్కల్‌ తాలూకా మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ’ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనజాక్షి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లన్న, గణాంక అధికారి యూసఫ్‌, ఉషా, ఆనంద్‌, నింగప్ప, భగవంత్‌ రెడ్డి, సాబయ్య, మారెప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement