రాహుల్‌ వ్యాఖ్యలు ఖండనీయం | - | Sakshi
Sakshi News home page

రాహుల్‌ వ్యాఖ్యలు ఖండనీయం

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

బళ్లారి అర్బన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో బళ్లారిలోని గడగి, చన్నప్ప సర్కిల్‌ వద్ద నిరసన చేపట్టారు. మధ్యప్రదేశ్‌ రాష్‌ట్రం ఇండోర్‌లో జరిగిన ఛాత్రోన్‌కి గంజ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీని అనుకరిస్తూ, తల్లి హీరాబెన్‌పై వ్యంగ్య నాటిక ప్రదర్శించడం సరికాదన్నారు. రాజకీయ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు. అయితే వ్యక్తిగతంగా తల్లులను దూషించడం, అగౌరవ పరచడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది భారతీయ సంస్కృతి, మాతృత్వానికి జరిగిన అవమానం అని మండిపడ్డారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శరణ్‌గౌడ, పదాధికారులు అడవి స్వామి, పుష్పలత, హంపీ రమణ, టీహెచ్‌.నవీన్‌ కుమార్‌, రామారెడ్డి, దొడ్డ బసవ, సింధిగేరి అంబన్న, నవీన్‌ రెడ్డి, బసవ రాజ్‌, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement