కరువు నిర్వహణలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

కరువు నిర్వహణలో ప్రభుత్వం విఫలం

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

బళ్లారి అర్బన్‌: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని జేడీఎస్‌ నాయకులు ఆరోపించారు. జేడీఎస్‌ జిల్లా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం బళ్లారిలోని డీసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జేడీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మీనల్లి తాయన్న మాట్లాడుతూ.. వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. విత్తనాలు, సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.2,500 పరిహారం ప్రకటించడం ఏ మాత్రం సరిపోదన్నారు. రైతుల పూర్తి వ్యవసాయ రుణాలను తక్షణమే మాఫీ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పశువుల కోసం నీరు, పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ కూలీలకు వెంటనే ఉపాధి కల్పించాలన్నారు. అంతకుముందు జేడీఎస్‌ కార్యాలయం నుంచి గడగి చన్నప్ప సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. డీసీ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజు నాయక్‌, లక్ష్మీకాంత రెడ్డి, హొన్నూర స్వామి, అడ్డిగేరి రామన్న, వసంత కుమార్‌, పుష్ప, రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement