పోకిరీ వేధింపులకు.. వివాహిత బలి | - | Sakshi
Sakshi News home page

పోకిరీ వేధింపులకు.. వివాహిత బలి

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

మైసూరు: మొబైల్‌ఫోన్‌ కొందరి చేతుల్లో వినాశకరంగా మారుతోంది. ఇట్టే నేరాలకు పాల్పడుతూ ఇతరుల కుటుంబాలను నాశనం చేస్తున్నారు. జిల్లాలోని హుణసూరు తాలూకాలోని లక్కనకొప్పలు గ్రామంలో ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంత, ఎం.ఆర్‌.సంధ్య భార్యాభర్తలు, కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. వికాస్‌ అనే గ్రామస్తుడు ఆమె ఫోటోలను సేకరించి అసభ్యంగా తయారుచేసి బ్లాక్‌మెయిల్‌ చేశాడని చెబుతున్నారు. మొబైల్‌ ద్వారా అశ్లీల సందేశాలను పంపేవాడు. అతని వేధింపులను భరించలేక సంధ్య పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు బిళికెరె పోలీసులు వికాస్‌, కుమార్‌, వసంత్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వికాస్‌ పరారు కావడంతో గాలిస్తున్నారు. నిందితున్ని అరెస్టు చేసేంతవరకు పోస్టుమార్టంకు ఒప్పుకునేది లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement