సాక్షి,బళ్లారి: జనావాసాల మధ్య సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయడం తగదని స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. నగరంలోని పటేల్ నగర్ ప్రాంతంలోని సత్యసాయి కాలనీలో నూతనంగా సెల్‌ఫోన్ టవర్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమ ఇళ్ల మధ్య సెల్‌ఫోన్ టవర్ ఉండకూడదని మండిపడుతున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సత్యసాయి కాలనీలో ఏర్పాటు చేస్తున్న సెల్‌ఫోన్ టవర్ ప్రాంతాన్ని పరిశీలించారు. జనం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కాలనీ వాసులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభ్యంతరాలను స్వీకరించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జనావాసాల మధ్య నిర్మాణానికి
స్థానికుల వ్యతిరేకత
పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
గాలి సోమశేఖరరెడ్డి


