● మరియమ్మనహళ్లి సమీపంలో ఘటన
● పశువుల యజమానికి భారీగా నష్టం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న గేదెల మందను రైలు ఢీకొనడంతో 8 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గేదెలు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన రైలు గేదెలపై నుంచి దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరియమ్మనహళ్లి నివాసి కల్లప్పకు చెందిన 8 గేదెలు మృతి చెందాయి. ఈ ఘటనతో పశువుల యజమానికి భారీగా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రైలు పట్టాల వెంట పశువుల సంచారాన్ని నియంత్రించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


