బనశంకరి: పశ్చిమ కనుమల పరిరక్షణపై కస్తూరికంగన్ నివేదిక మీద రెండవరోజు మంగళవారం విధానసభలో వాడీవేడిగా చర్చ సాగింది. కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ను యథాతథంగా ఆమోదించకూడదని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆరుసూత్రాల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కస్తూరిరంగన్ నివేదికలోని లోపాలను సరిదిద్ది తగిన మార్పులు సూచించడానికి, రాష్ట్ర ప్రభుత్వంచే నంబర్ల వారీగా భూ సర్వే కొలతలు తీసుకోవడానికి విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వాటిని పరిరక్షించాలి: సీఎం
విధానసభలో రంగన్ నివేదికపై చర్చలో సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. ‘మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, అడవి అంటే భూమి ఉంటుంది, అడవి ఉంటేనే వర్షాలు కురుస్తాయి. అలాగే రైతులను కూడా కాపాడాలి. నివేదిక సిఫార్సులపై గ్రామస్థాయిలో సర్వే నిర్వహించాలనే అభిప్రాయాలున్నాయి, దీంతో ఏకీభవిస్తున్నా. నిర్దేశిత ప్రాంతాల్లో ముందుగా వ్యవసాయం, ఉద్యానవన రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోడ్లు, ఆసుపత్రులు ఉన్నాయి, వాటి పరిరక్షణ మనతో పాటు కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా’ అని చెప్పారు.
ఆ జిల్లాలకు ఇబ్బందులు వస్తాయి
నివేదిక అమలైతే ఉత్తరకన్నడ, మైసూరు, బెళగావి, ఉడుపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో సమస్యలు తలెత్తుతాయని, సామాన్య ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని సీఎం డీకే తెలిపారు. వెంటనే కేంద్రప్రభుత్వానికి ఒక దరఖాస్తు సమర్పించాలని చెప్పారు. రిటైర్డు జడ్జితో ఓ కమిటీని నియమించి కస్తూరిరంగన్ నివేదికలోని లోపాలను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, అటవీశాఖల అధికారులు, రైతుసంఘాలు, పరిశ్రమల ప్రతినిధులు, అటవీ, పర్యావరణ సంబంధ నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన కమిటినీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నివేదికలో పేర్కొన్న సర్వే నంబర్ల భూముల్లో కొలతలు తీస్తామన్నారు. ఈ ప్రక్రియకు ఏడాది సమయం ఇవ్వాలని కేంద్ర సర్కారును కోరతామని తెలిపారు. జూలై 27 న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 7వ ముసాయిదా, ఈఎస్‌ఏ నోటిఫికేషన్‌ను శాసనసభ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని, అందులోని లోపాలు సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
నివేదికపై రిటైర్జు జడ్జి కమిటీతో అధ్యయనం
ఇందుకు ఏడాది సమయం పడుతుంది
కేంద్ర నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్నాం
అసెంబ్లీలో సీఎం డీకే శివ ప్రకటన


