● పునః పరిశీలించండి
● సర్కారుకు గవర్నర్ లేఖ
శివాజీనగర: వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం డీకే శివకుమార్‌కు 4 పేజీల లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాజ్యాంగ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వును పునఃపరిశీలించాలని గవర్నర్ సూచించారు. కేంద్ర హోం శాఖ వందేమాతరం అధికారిక వెర్షన్‌ను ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సవరణలు చేయడానికి ఎలాంటి నిబంధన లేదని గవర్నర్ స్పష్టం చేశారు. వందేమాతరం గీతాన్ని రెండు పంక్తులు పాడితే చాలని ఇటీవల డీకే సర్కారు ఆదేశించడం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వెలిబుచ్చింది.


