శివాజీనగర: డీసీపీనా మాట్లాడేది.. నా కారునే టోయింగ్ చేస్తావా? అని మాజీ సీఎం సిద్దరామయ్య, విధానసౌధ భద్రతాధికారి, డీసీపీ యోగేష్‌పై మండిపడ్డారు. అసెంబ్లీలో సమావేశం చూసుకుని పశ్చిమ ద్వారం మెట్లు దిగి బయటకు వచ్చినప్పుడు, అక్కడ నిలిపిన కారు లేదు. విచారించగా, డీసీపీ యోగేష్ ఆదేశాల మేరకు పోలీసులు కారును పార్కింగ్ లాట్‌కు పంపినట్లు తెలిపారు.
దీంతో ఆయన కారు కోసం కొంతసేపు నిలబడ్డారు. ఈ ఘటనతో చాలా కలత చెందారు, కొందరు ముఖ్యులు కూడా ఆయన చుట్టూ చేరారు. వెంటనే డీసీపీ యోగేష్‌కు ఫోన్ చేసి.. ‘నా కారును ఇక్కడి నుండి ఎందుకు తీసుకువెళ్లారు?. మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. విధానసౌధకు వచ్చే ప్రజా ప్రతినిధులను, ఎమ్మెల్యేలను మీరు సరిగ్గా గౌరవించడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. ప్రజాప్రతినిధులతో ఇలా ప్రవర్తించకూడదు. ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా పనిచేయాలి’ అని మాజీ సీఎం హెచ్చరించారు. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కారు రాగానే సిద్దరామయ్య వెళ్లిపోయారు. హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేకు కూడా సిద్దరామయ్య ఫిర్యాదు చేశారు. చివరకు డీసీపీ క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది.
నీపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి
మాజీ సీఎం సిద్దరామయ్య నిప్పులు
విధానసౌధ ఆవరణలో టెన్షన్
మంగళవారం విధానసౌధ ఆవరణ. విధానసభ లోపలి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్య బయటకు వచ్చారు, అక్కడ ఉండాల్సిన తన కారు కనబడకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తరువాత హైడ్రామా మొదలైంది.


