రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ కాలువపై ఆందోళన చేపట్టారు. మంగళవారం సింధనూరు తాలూకా గాంధీనగర్ 36వ నంబరు ఉప కాలువ వద్ద చేపట్టిన ఆందోళనలో మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, శాసన సభ్యుడు హంపన గౌడ బాదర్లి, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప మాట్లాడారు. జిల్లాధికారిణి పూవిత ఈనెల 22న కాలువలకు నీరు బంద్ చేయాలని ఆదేశించిన ఉత్తర్తులను ఖండిస్తూ తుంగభద్ర ఎడమ కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. 32, 36వ ఉప కాలువలను బంద్ చేయకుండా నీరు యథావిధిగా ప్రవహించేలా రైతులు చేతులు కల్పి పోరాడేఉతున్నా కింది భాగానికి నీరు అందక పోవడంపై విరుచుకు పడ్డారు. 69 వేల ఎకరాలకు నీరందించాలంటే 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. కాలువ పైభాగంలో అక్రమంగా వేసుకున్న పైపులను తొలగించాలన్నారు. కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి నీటిని కింది భాగానికి వదలకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి పోలీసు భద్రతను కల్పించారు. లింగసూగూరు ఏసీ నాగేంద్ర బాబు, డీఎస్పీ చంద్రశేఖర్‌లకు పైఅధికారులతో చర్చించాలని నేతలు డిమాండ్ చేశారు.
తుంగభద్ర ఎడమ కాలువ వద్ద గుమికూడిన రైతులు
సాగు నీటి కోసం ఆందోళనలో పాల్గొన్న రైతులు
జిల్లాధికారిణి వ్యవహారశైలిని
ఖండిస్తూ ధర్నా
బైటాయించిన కాంగ్రెస్, బీజేపీ,
జేడీఎస్ నేతలు
ఉప కాలువలకు వెంటనే నీరు
అందించాలని డిమాండ్


