రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

బొమ్మనహళ్లి : రామనగర నగరంలోని జిల్లా స్టేడియంలో జిల్లా పంచాయత్‌, ప్రజా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–14, అండర్‌–17 ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో క్రీడల్లో 17 మంది స్వర్ణ పతకాలు సాధించారు. వీరిలో 10 మంది బాలురు, 7 మంది బాలికలు యాదగిరిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు అధికారులు తెలిపారు.

కరువు పరిహారం అందించాలి

కోలారు: జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున ప్రభుత్వం వెంటనే కరువు పరిహార నిధులు అందించాలని, లేకుంటే బెంగళూరు చలో నిర్వహిస్తామని జేడీఎస్‌ నాయకుడు సీఎంఆర్‌ శ్రీనాథ్‌ హెచ్చరించారు. మంగళవారం కరువు పరిహార నిధుల కోసం జేడీఎస్‌ ఆధ్వర్యంలో నగరంలోని మెక్కె సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. కోలారు జిల్లాలో ఈసారి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ప్రజలకు తాగునీరు లభించడం కూడా కష్టంగా మారిందన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కరువు పరిస్థితులను నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కరువు సమయంలో రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.

విద్యార్థిని ఆత్మహత్య

పావగడ: పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్‌ హొసకోటె గ్రామానికి చెందిన పీయూసీ విద్యార్థిని లిఖిత(18) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన శివణ్ణ, గీత దంపతుల కుమార్తె లిఖిత స్నానానికి స్నానపు గదిలోకి వెళ్లింది. అయితే ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లి గీత స్నానపు గది తలుపులు తెరవడంతో లిఖిత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రోదనలు చూపరులందరికీ కన్నీళ్లు తెప్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement