డిమాండ్లు తీర్చాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లు తీర్చాలని నిరసన

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

హొసపేటె: కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మార్క్సిస్ట్‌(సీపీఎం) తాలూకా కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని ఒత్తిడి చేస్తూ నిరసన చేపట్టారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు అక్రమ టోల్‌ వసూళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నిరసన చేస్తున్న సీపీఎం నాయకుల అరెస్టును ఖండించారు. రాయచూరులో దళిత మహిళపై జరిగిన హత్యాచారం, హత్య కేసులో నిందితులకు తగిన శిక్ష విధించడంతో సహా వివిధ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు తహసీల్దార్‌ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నైస్‌ కంపెనీ స్వాధీనం చేసుకున్న భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని, అక్రమ టోల్‌ వసూళ్లను నిలిపి వేయాలని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కే.ప్రకాష్‌, కే.నాగరత్నమ్మ, ఎం.గోపాల్‌, ఏ.కరుణానిధి, బీ.రమేష్‌కుమార్‌, హేమంత్‌, ఈ.మంజునాథ్‌, వీ.స్వామి, కేఎం.స్వప్న, ఎస్‌.యల్లమ్మ, శకుంతల, ఎం.జంబయ్య నాయక్‌, బీ.తాయప్పనాయక్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement