కారు బీభత్సం.. 2 వాహనాలను ఢీ | - | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం.. 2 వాహనాలను ఢీ

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

యశవంతపుర: కారు, బైకు, వ్యాన్‌ను ఢీకొనడంతో ముగ్గురు చనిపోగా, ఏడుమంది గాయపడిన ఘటన కొడగు జిల్లా కుశాలనగర– మడికెరి రహదారిలో ఆనెకాడు వద్ద ఆదివారం రాత్రి జరిగింది. మృతులు అదే జిల్లాలోని 7వహొసకోటకు చెందిన ఎలక్ట్రిషియన్‌ రతన్‌ ఉణ్ణి (36), మిత్రుడు ఆదర్శ్‌ (26), బైకిస్టు అటవీశాఖ కాంట్రాక్టు ఉద్యోగి, స్థానికుడు కుమార్‌ (42)గా గుర్తించారు. కారులోని రతన్‌, ఆదర్శ్‌లు నిమజ్జనం చూసుకుని కారులో తిరిగి 7వ హొసకోటకు వెళుతున్నారు. ఓవర్‌టెక్‌ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్నారు, తరువాత మరో వ్యాన్‌ను ఢీకొనడంతో అన్ని వాహనాలు నుజ్జయ్యాయి. కారులోని ఇద్దరు, బైకిస్టు అక్కడే మరణించారు. వ్యాన్‌లోని 7 మంది గాయపడి కుశాలనగర ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మైసూరు, మడికెరి ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు దుర్మరణం

కొడగు జిల్లాలో ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement