25 నుంచి గృహ నిర్మాణ సామగ్రి ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

25 నుంచి గృహ నిర్మాణ సామగ్రి ప్రదర్శన

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

సాక్షి,బళ్లారి: నగరంలోని ఐటీఐ కళాశాలలో ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు గృహ నిర్మాణాలకు సంబంధించి అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా అన్ని రకాల గృహ నిర్మాణ సామగ్రిని ప్రదర్శిస్తున్నట్లు జిల్లా ఇంజనీర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ బళ్లారి అసోసియేషన్‌, సివిల్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నగరంలోని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే అన్ని రకాల సామగ్రిని ప్రదర్శిస్తారన్నారు. తక్కువ ధరకే ఇళ్లు ఎలా నిర్మించాలో ఇక్కడ తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. నగర వాసులు ప్రదర్శన వీక్షించి లబ్ధి పొందాలన్నారు. అసోసియేషన్‌ ప్రముఖులు శశిధర్‌, గజేంద్ర, రాకేష్‌, నిరంజన్‌, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement