డీసీసీ అధ్యక్షుడిగా శాంతప్ప | - | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్షుడిగా శాంతప్ప

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

రాయచూరు రూరల్‌: జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శాంతప్ప పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడు బసవరాజ్‌ పాటిల్‌ ఇటగి శాంతప్పకు బాధ్యతలు అప్పగించారు. 30 ఏళ్ల పాటు పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్ష పదవిని అప్పగించారన్నారు. పార్టీ కార్యకర్తల సహకారంతో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి పార్టీలో ఐక్యతను సాధిస్తామన్నారు. అమరేగౌడ, రుద్రప్ప, పంపనగౌడ, ఆంజనేయ, శివమూర్తి, నరసింహులున్నారు.

సమగ్ర దర్యాప్తు కోసం ధర్నా

రాయచూరు రూరల్‌: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను అరెస్ట్‌ చేసి, కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కన్నడ దళిత సేన సంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. అశ్విని మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. ఇటీవల జిల్లాలో దళిత యువతులు, మహిళలపై అధకంగా జరుగుతున్న దాడులను నియంత్రించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఆయకట్టు భూములకు

నీరు వదలండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువల నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. సోమవారం సింధనూరులో చేపట్టిన ఆందోళనలో మాజీ మంత్రి వెంకట్రావ్‌ నాడగౌడ, శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప ఒత్తిడి చేశారు. తుంగభద్ర ఎడమ కాలువల్లో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్‌ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. 54వ నంబరు ఉప కాలువ కింది భాగంలో నీరు అందక పోవడంపై విరుచుకు పడ్డారు. 69 వేల ఎకరాలకు నీరందించాలంటే 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. కాలువపై అక్రమంగా వేసుకున్న పైపులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్‌ తంగడిగి కాలువ పైభాగంలో నీటిని కింది భాగానికి వదలకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు.

వర్షంలోనూ నిమజ్జనం

కెలమంగలం: కెలమంగలం పట్టణ పంచాయతీలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమల నిమజ్జనం ఆదివారం ఘనంగా సాగింది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉదయం నుంచి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం నిమజ్జనానికి ముందే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నా భక్తులు వెనకడుగు వేయలేదు. ఊరేగింపును కొనసాగించి గంగమ్మ ఒడిలో వదిలారు. డెంకణీకోట ఏడీఎస్పీ శంకర్‌ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement