వర్షపు జల్లులు.. రైతుల్లో హర్షాతిరేకాలు | - | Sakshi
Sakshi News home page

వర్షపు జల్లులు.. రైతుల్లో హర్షాతిరేకాలు

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

కోలారు: తాలూకాతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు, నీటికుంటల్లో నీరు నిలిచి రైతుల ముఖాల్లో మందహాసం కనిపిస్తోంది. ముంగారు వానలు సక్రమంగా కురవక తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి పశువుల మేత కరువై పాడి పరిశ్రమ కూడా వెనుకబడుతున్న తరుణంలో కురిసిన ఈ వానలు రైతులను ఆనంద పరుస్తున్నాయి. ఈ వానలకు పచ్చిమేత మొలిచి పశువుల ఆహారానికి కొరత ఉండదని రైతులు, పాడి రైతులు ఆనంద పడుతున్నారు. బంగారుపేటె తాలూకాలో అధికంగా వర్షం కురిసింది. అర్థరాత్రి ప్రారంభమైన వాన తెల్లవారు జాము వరకు కురిసింది. దీని వల్ల బంగారుపేటె తాలూకాలోని మార్కండేయ జలాశయం, యరగోళు జలాశయం, కామసముద్రం వృషభావతి చెరువు, ముష్ట్రహళ్లి చెరువులకు నీరు చేరింది. ముంగారులో వానలు లేక వ్యవసాయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న రైతులు ప్రస్తుతం ఉల్లి, జొన్నలు విత్తడానికి సిద్ధమవుతున్నారు. భారీ వానలకు బూదికోటె సమీపంలో రహదారిపై చెట్టు కొమ్మ విరిగి పడడంతో వాహన సంచారానికి అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు చెట్టుకొమ్మను తొలగించి సంచారానికి అనుకూలం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు కోలారు జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement