12 ఏళ్ల పరారీకి తెర | - | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల పరారీకి తెర

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

సాక్షి, బళ్లారి: 12 ఏళ్ల పరారీకి తెర పడింది. ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చి పోలీసుల నుంచి తెలివిగా తప్పించుకుని తిరుగుతున్న ఖైదీని ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. వివరాలు ఇలా.. బాగల్‌కోట జిల్లా ముధోల్‌కు చెందిన బసవరాజ్‌ పాటిల్‌ 2009లో హుంగుండ్‌ ప్రాంతంలో జరిగిన వ్యవసాయ అధికారి హత్య కేసులో నిందితుడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. 2014లో విజయపుర జిల్లా జైలులో ఉండగా అనారోగ్యం సాకుతో జిల్లాస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దీనిపై విజయపుర గాంధీ చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి వేషం మార్చుకుంటూ 12 సంవత్సరాలుగా తప్పించుకుని తిరిగాడు. కుటుంబంతో సహా పాత పరిచయాలను కట్‌ చేశాడు. బెల్గాం జిల్లా బైలహోంగల్‌ తాలూకాలోని సిద్ధసముద్ర గ్రామానికి చేరుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా గడ్డం, మీసాలు పెంచుకున్నాడు. రైతు అవతారం ఎత్తి ఆ గ్రామంలో పొలాన్ని లీజుకు తీసుకుని పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. విజయపుర జిల్లా పోలీసులు ఖైదీని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ టీం ఏర్పాటు చేశారు. ఆధునిక టెక్నాలజీ, ఫింగర్‌ ప్రింట్‌ సహాయంతో బసవరాజ్‌ పాటిల్‌ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. సిద్ధసముద్ర గ్రామంలో ఉన్నట్లు గుర్తించి దాడి చేసి పట్టుకున్నారు.

హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement