హత్య కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించండి | - | Sakshi
Sakshi News home page

హత్య కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించండి

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసులను సీఐడీకి అప్పగించాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ఎస్‌.మారెప్ప డిమాండ్‌ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హద్దినాళలో బీఎస్పీ, దళిత కార్యకర్త భూమానంద హత్య, కరడకల్‌లో రేణుక హత్య, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేయాలని, ఈ కేసులను సీఐడీకి అప్పగించాలన్నారు. ఘటనలు జరిగి నెల రోజులు పైగా కావస్తున్నా రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్‌ ఖర్గే కనీసం జిల్లాలో పర్యటించి సాంత్వన పలకక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రవీంద్రనాథ్‌, విశ్వనాథ్‌, నరసింహులు, శివకుమార్‌, బేరి, అంబన్న, హేమరాజ్‌లున్నారు.

సంక్షేమ పథకాలు

ప్రజల దరి చేర్చండి

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చాలని జిల్లాధికారిణి పూవిత సూచించారు.శ ఆమె శనివారం లింగసూగూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రజా సేవా పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. సర్కార్‌ మహిళలకు అమలు చేసిన శక్తి, గృహలక్ష్మి పథకాల లబ్ధిని పొందాలని అన్నారు. నెల నెలా రూ.2 వేలు మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు పాలనను అందించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన అధికారులు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి శరణమ్మ, జిల్లా ఆరోగ్య అధికారిణి నందితలున్నారు.

డీసీసీ ఎస్టీ సెల్‌

అధ్యక్షురాలిగా మమత

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ అధ్యక్షురాలిగా మమతను నియమిస్తూ రాష్ట్రాధ్యక్షుడు విజయ్‌ నాయక్‌ ఆదేశాలు వెలువరించారు. 15 ఏళ్ల పాటు పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. డిసెంబర్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కార్యకర్తల సహకారంతో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్‌ పటేల్‌ సూచించారు.

రుణాల్ని చెల్లిస్తేనే ప్రగతి

కోలారు: రుణాల వసూళ్లలో పీఎల్‌డీ బ్యాంకు జిల్లాలోనే రెండవ స్థానంలో ఉంది, రైతులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని బ్యాంకు అధ్యక్షుడు కెందట్టి ఏ. శివకుమార్‌ తెలిపారు. శనివారం నగరంలోని టీ. చన్నయ్య రంగమందిరంలో పీఎల్‌డీ బ్యాంకు సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎం వెంకటరాం, డైరెక్టర్‌, విట్టప్పనహళ్లి డెయిరీ అధ్యక్షుడు వెంకటేష్‌, ఎన్‌ జీ బ్యాటప్ప తదితరులు పాల్గొన్నారు.

చిరునామా అడిగినట్లు నటించి నగల చోరీ

కెలమంగలం: చిరునామా అడిగినట్లు నటించి నగలు చోరీ చేసిన తపాలా ఉద్యోగిని తళి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని దొడ్డఉబ్బనూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మ రెండు రోజుల క్రితం భర్తతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. నల్లకారులో వచ్చిన వ్యక్తి ఉబ్బనూరుకు వెళ్లేందుకు దారి అడిగాడు. కొత్తగా వచ్చిన వ్యక్తికి దారి తెలియక అడుగుతున్నాడని భావించిన భాగ్యమ్మ.. తాను అదే గ్రామానికి వెళ్తున్నా అని చెప్పి అతడి కారులో ఎక్కి కూర్చొంది. కొద్ది దూరం వెళ్లగానే ఆమె మెడలో ఉన్న 38 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అలాగే ఉబ్బనూరు బస్టాప్‌ వద్ద నడుచుకుని వెళ్తున్న విజయమ్మ మెడలో ఉన్న 50 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఈ ఘటనలపై బాధిత మహిళలు తళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఆనేకల్‌ సమీపంలోని గేరెట్టిహళ్లి గ్రామానికి చెందిన జీవన్‌ కుమార్‌ అని విచారణలో తేలింది. హొసకోటె ప్రాంతంలోని తపాలా కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తూ తరచూ దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement