సాక్షి,బళ్లారి: వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను పలు కాలనీల వాసులు నిమజ్జనం చేశారు. బుధవారానికి వినాయక చవితి మూడో రోజు కావడంతో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత దారి పొడవునా డీజేలు, భక్తి పాటలతో పాటు, హుషారును హోరెత్తించే సినిమా పాటలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ, బాణసంచా పేలుస్తూ నగర వీధుల గుండా ట్రాక్టర్లు, ఆటోల్లో ఊరేగింపు నిర్వహించి సమీపంలోని హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ ప్రధాన కాలువలతో పాటు, ఉప కాలువల్లో నిమజ్జనం చేశారు. పలు కాలనీల్లో మూడు రోజులకు నిమజ్జనం చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో ఐదో రోజు అంటే శుక్రవారం నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వేడుకగా వినాయక నిమజ్జనం
రాయచూరు రూరల్: నగరంలో ప్రత్యేకంగా గణపతుల నిమజ్జనం చేశారు. బుధవారం మూడో రోజు వినాయకుల నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైల్వే స్టేషన్ మాస్టర్, రైతు గణపతులను వ్యాపారుల సంఘం వారు ఏర్పాటు చేశారు. అందరినీ ఆకట్టుకునేలా రూపొందించిన గణేష్‌తో పాటు రైతులు, ఎద్దులున్న వినాయకుడి విగ్రహాన్ని కాస్‌బావిలో నిమజ్జనం చేశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
విద్యుత్ దీపాలతో వాహనాల అలంకరణ
దారి పొడవునా నినాదాలు, నృత్య ప్రదర్శనలు


