దేశాభివృద్ధిలో విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

బళ్లారిఅర్బన్‌: కన్నడ భాషాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య చేసిన సేవలు అమోఘమని ఆర్‌వైఎం ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హెచ్‌.మహాబలేశ్వర్‌ అన్నారు. మంగళవారం బసవదళ్‌ హాల్‌లో నిర్వహించిన సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజనీర్‌గా మాత్రమే కాకుండా కర్ణాటక సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన దార్శనికుడని కొనియాడారు. ఇంజనీర్‌ టి.మల్లికార్జున, కేపీటీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ తిప్పారుద్ర గుండెగౌడ, రిటైర్డ్‌ ఇంజనీర్‌ కేణి బసప్ప, కల్గుడి మంజునాథ్‌, పల్లెద బసవరాజ, బసవరాజ నావడగి, ప్రొఫెసర్‌ హెచ్‌.మల్లికార్జున, మరిరాజగౌడ, కేఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నిష్ఠిరుద్రప్ప, చాంద్‌పాషా, కేవీ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇంజనీర్స్‌ దినోత్సవం

హొసపేటె: తుంగభద్ర మండలి కార్యాలయ ఆవరణలో ఇంజనీర్స్‌ దినోత్సవం నిర్వహించారు. మండలి అధికారులు సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి దినోత్సవాన్ని ప్రారంభించారు. మండలి కార్యదర్శి శ్రీనివాస బైరి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌ సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను వివరించారు. మండలి ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement