శాంత హొసమనికి లుకౌట్‌ | - | Sakshi
Sakshi News home page

శాంత హొసమనికి లుకౌట్‌

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

రికార్డు నాట్యం

బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాధికారులు పోస్టుల అక్రమాలలో పరారీలో ఉన్న ఆ సంస్థ సభ్యురాలు శాంత హొసమనిపై సీఐడీ లుకౌట్‌ నోటీస్‌ జారీచేసింది. గత నెలలో ఈడీ అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసినప్పటి నుంచి ఆమె జాడ లేరు. మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసుకుంది. కుటుంబ సభ్యులు కూడా నోరుమెదపడం లేదు. అరెస్ట్‌ భయంతో పరారైనట్లు తెలుస్తోంది. మూడోసారి నోటీస్‌ జారీ చేయనున్నారు. ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ను సీఐడీ మరోసారి విచారించింది. అక్రమాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన కుమార్తె కుల, ఆదాయ సర్టిఫికెట్‌లో సాంకేతిక లోపాటు తలెత్తి ఉండవచ్చు, అంతేతప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పరీక్షల ప్రక్రియ కంట్రోలర్‌ ఆధీనంలో ఉంటుందని, ఇందులో తన పాత్రలేదని చెప్పినట్లు తెలిసింది. పరీక్షల కంట్రోలర్‌, ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్రకుమార్‌, బ్రోకరు బసవరాజ కన్నాళేను కస్టడీలో విచారిస్తున్నారు.

ఆందోళనబాటలో విద్యార్థులు

పశు వైద్యాధికారుల పరీక్షలు రాసిన నిరుద్యోగ యువత ఈ స్కాం నేపథ్యంలో ఢిల్లీ జెన్‌ జీ తరహాలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. బెంగళూరు స్వతంత్రపార్కులో ఈనెల రెండోవారం నుంచి చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

కేపీఎస్‌సీ స్కాంలో సీఐడీ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement