ఇస్కాన్‌లో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ఇస్కాన్‌లో ప్రత్యేక పూజలు

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

హుబ్లీ: ఇస్కాన్‌ వ్యవస్థాపకుడు ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆవిర్భావ దినం (పుట్టిన రోజు) సందర్భంగా స్థానిక రాయపుర్‌లోని ఇస్కాన్‌ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుపాదుల ఉత్సవ విగ్రహానికి అభిషేకం, తదితర పూజలు చేశారు. మహా నైవేద్యం కోసం భక్తులు తయారు చేసిన 3000 భక్షాలను ప్రభుపాదులకు సమర్పించారు. ఆ ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు.

సన్మానం.. వివాదాస్పదం

హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ నగర పోలిస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన భూషణ బుర్సేను గంజాయి, హత్య కేసుల్లో నిందితులు సన్మానించడం వివాదాస్పదంగా మారింది. మత్తు మందుల రవాణా, హత్య కేసులో నిందితుడు అయిన కేత్‌సింగ్‌ రాజపురోహిత, గౌరీ లంకేశ్‌ హత్య కేసులో నిందితుడు అమిత్‌ బద్ది కమిషనర్‌ను సన్మానించారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement