అన్యమతస్తుడిని శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

అన్యమతస్తుడిని శిక్షించాలి

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

హుబ్లీ: హావేరి జిల్లా శిగ్గావిలోని టెంపో స్టాండ్‌ సమీపంలో ఉన్న చారిత్రాత్మక ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అన్యమతస్తుడు ఉద్దేశపూర్వకంగా మూత్ర విసర్జన చేయడంపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన హావేరిలో విలేకరులతో మాట్లాడారు. శిగ్గావి బంద్‌ చేపట్టాలని హిందూ సంఘాలకు పిలుపునిచ్చారు. అన్యమతస్తుడు కావాలనే ఆలయ ఆవరణంలో మూత్ర విసజ్జన చేశారని మండిపడ్డారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టణంలో భద్రత చేపట్టాలని సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యం.. పోలీసులు సస్పెండ్‌

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా సిరవార తాలూకా హోక్రాణి గ్రామంలో దళిత యువతి అశ్విని అత్యాచారం, హత్య ఉదంతంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు సిరవార పోలీసులను బళ్లారి రేంజ్‌ ఐజీపీ ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు రాయచూరు జిల్లా ఎస్పీ అరుణాంశు గిరి వివరాలను వెల్లడించారు. హెడ్‌ కానిస్టేబుల్స్‌ భీమరెడ్డి, వీరేష్‌, కానిస్టేబుల్స్‌ దేవరాజ్‌, నాగరాజ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఏమిటీ కేసు..

హోక్రాని గ్రామంలో మలవిసర్జనకు వెళ్లిన అశ్విని (22) అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణం స్పందించక పోవడం, సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో అశ్విని ఓ బావిలో శవమై తేలింది. ఆమైపె అత్యాచారం చేసి హత్య చేశారని సమాచారం. కేసు నమోదు, యువతి ఆచూకీ కనుగొనడంలో విఫలమైన నలుగురిని సస్పెండ్‌ చేస్తూ బళ్లారి రేంజ్‌ ఐజీపీ ఆదేశాలు జారీ చేశారు.

కొకై న్‌ జప్తు.. ముగ్గురు అరెస్ట్‌

హుబ్లీ: కొకై న్‌ను కారులో గోవా నుంచి హుబ్లీకి తరలిస్తుండగా ధార్వాడ ఉప నగర పోలీసులు మెరుపు దాడి చేశారు. ధార్వాడ కెలగేరి రోడ్డు వినాయక నగర్‌ వద్ద నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.40 లక్షలు విలువ చేసే కొకై న్‌ సీజ్‌ చేశారు. కారు, మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. హుబ్లీ భవాని నగర్‌ నివాసి రిసిపాండే, విద్యానగర్‌ సిద్దేశ్వర్‌ పార్కు నివాసి సర్వేష్‌ పాటిల్‌, శ్రేయా నగర్‌ నివాసి దీపక్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అందరి సహకారంతో గ్రామాభివృద్ధి

రాయచూరు రూరల్‌: అందరి సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యం. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పథకాల కింద మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని విధాన పరిషత్‌ సభ్యుడు బోసురాజ్‌ పేర్కొన్నారు. ఆదివారం మాన్విలో అక్క కేఫ్‌ను ప్రారభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికారులు ముందుండి పనులు నాణ్యతగా పూర్తి చేయించాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వావలంబనకు సర్కార్‌ కృషి చేస్తోందని వివరించారు. గవిగట్టులో రూ.4.43 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్‌, అమరేశప్ప, శరణయ్య నాయక్‌, బాల స్వామి కోడ్లి, సుభాష్‌, అబ్దుల్‌ పాల్గొన్నారు.

శాంతిభద్రతలను కాపాడండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో దౌర్జన్య నియంత్రణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని జిల్లా అధికారి పూవిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా అధికారి కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, ఎస్సీ, ఎస్టీ చట్టంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల సిరవార తాలూకా హోక్రాణిలో దళిత యువతి అశ్వినిపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా దౌర్జన్య నియంత్రణ చట్టం సక్రమంగా అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ హంపన్న, ఎస్పీ అరుణాంగ్శు గిరి, డీఎస్పీ శాంతవీర, శరణమ్మ, నందిత తదితరులు పాల్గొన్నారు.

కారును లారీ ఢీ.. ఇద్దరు మృతి

క్రిష్ణగిరి: జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలేర్పడిన ఘటన కందికుప్పం వద్ద జరిగింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా బర్గూరుకు చెందిన సతీష్‌(22), అశోక్‌కుమార్‌(24), దివాకర్‌(18), తిరుపతి (22), అన్బళగన్‌ తిరుపతి (22) కలిసి శనివారం సాయంత్రం కారులో క్రిష్ణగిరి వైపు వెళుతున్నారు. క్రిష్ణగిరి పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొనింది. కారు పల్టీలు కొట్టి నుజ్జయింది. స్థానికులు కారులో ఇరుక్కుపోయిన బాధితులను చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా అన్బళగన్‌ తిరుపతి చనిపోయాడు. నలుగురికి ఆస్పత్రిలో చికిత్సలందజేస్తుండగా అశోక్‌కుమార్‌ మృతి చెందాడు. కందికుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement