అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

బళ్లారిఅర్బన్‌: నగర శివార్లలో సిరుగుప్ప రోడ్డులోని వక్రాణి క్యాంప్‌ సమీపంలోని అక్షర గ్లోబల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సంకల్ప –2026 వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు నిర్వహించిన అక్షర టాలెంట్‌ ఎక్స్‌పోలో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. కార్యక్రమాన్ని అక్షర గ్లోబల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీ అధ్యక్షురాలు డాక్టర్‌ అనురాధ ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలాపన, సాంస్కృతిక నృత్యాలు, యోగా, స్కేటింగ్‌ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement