13న రాష్ట్ర బంద్‌ తథ్యం | - | Sakshi
Sakshi News home page

13న రాష్ట్ర బంద్‌ తథ్యం

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

వాటాళ్‌ నాగరాజ్‌ ప్రకటన

హుబ్లీ: తమిళనాడుకు కావేరి జలాల విడుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 13న కన్నడ సంఘాల ఒక్కూట రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది, దీంతో బంద్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. వానలు వచ్చి నీటిని వదలడంతో పెద్ద సమస్య ఎదురుకాలేదు. ఇంతలోనే రోజూ ఓ టీఎంసీ దాకా విడుదల చేయాలని తాజాగా కావేరి కమిటీ రాష్ట్రాన్ని ఆదేశించడంతో పరిస్థితి వేడెక్కింది. ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా కన్నడ సంఘాల ప్రముఖ నాయకుడు వాటాళ్‌ నాగరాజ్‌ మాత్రం బంద్‌ నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆయన మంగళవారం హుబ్లీలో కేసీ కూడలిలో కన్నడ సంఘాల నేతతో కలిసి ధర్నా చేశారు. కళసా బండూరి నీటి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ముందు అనుకున్నట్లు 13వ తేదీ గురువారం రాష్ట్ర బంద్‌ చేపట్టడం తథ్యమని చెప్పారు. కావేరి జల వివాదం మాత్రమే కాకుండా కావేరిపై మేకెదాటు ప్రాజెక్ట్‌ అమలు, ఉత్తర కర్ణాటక జీవనాడి మహదాయి ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జాప్యంపై కూడా న్యాయం లభించాలని, అందుకు పోరాటం అనివార్యమని వాటాళ్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement